ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

ABN, First Publish Date - 2020-08-18T10:42:35+05:30

నదీ తీరా గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు ల్లేకుండా చూడాలని పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ 


గద్వాల క్రైం, ఆగస్ట్‌ 17: నదీ తీరా గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు ల్లేకుండా చూడాలని పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో  సోమవారం వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీస్‌ అఽధికారులతో నేర సమీక్షా స మావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేరాల అదుపు చేయడంలో అధికారులు కీలకపాత్ర పోషించాలన్నారు. కేసులు పెం డింగ్‌లో లేకుండా వేగంగా దర్యాప్తును చేపట్టాలన్నారు. నదీతీర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీస్‌ అధికారులు అప్ర మత్తంగా ఉండాలన్నారు. అదనపు ఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, సీఐలు హనుమంతు, వెంకటేశ్వరయ్య, వెంకటేశ్వర్లు ఉన్నారు.


సమస్యలను  పరిష్కరించేందుకు కృషి

సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఎనిమిది ఫిర్యాదులు రాగా ఫిర్యాదుదారులతో నేరుగా ఎస్పీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చూడాలని ఆయా అధికారులకు ఆదేశించారు.

Updated Date - 2020-08-18T10:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising