ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారి కబ్జాపై..ఆందోళన

ABN, First Publish Date - 2020-12-27T03:54:22+05:30

కోస్గి పట్టణంలోని పాతరగడ్డ హనుమాండ్ల దేవాలయానికి వెళ్లే రహదారిని కొందరు ఆక్ర మించుకుని వెంచర్లు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.

కోస్గిలోని మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోస్గి, డిసెంబరు 26 : కోస్గి పట్టణంలోని పాతరగడ్డ హనుమాండ్ల దేవాలయానికి వెళ్లే రహదారిని కొందరు ఆక్ర మించుకుని వెంచర్లు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఆక్రమణను నిరసి స్తూ స్థానిక యువకుడు మ్యాకల రవికుమార్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకలేదు. దీంతో శనివారం పాతర గడ్డ హనుమాండ్ల దేవాలయం ఎదురుగా మహబూబ్‌నగర్‌ ప్రధాన రహ దారిపై ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు స్థానిక బీజేపీ, కాంగ్రెస్‌, ఏబీవీ పీ, ఎస్సీ పరిరక్షణ సమితి నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దశబ్దాలుగా కొనసాగుతున్న పంచాయతీరాజ్‌ రో డ్డును కబ్జాకు గురిచేసి ప్లాట్లుగా మార్చినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారులు వచ్చేంత వరకు ఆందోళన విరమించేదిలేదని రోడ్డుపై బైౖఠాయించి నినాదాలు చేశారు. మునిసిపల్‌ కమిషనర్‌ ఆందోళన కారులతో ఫోన్‌లో మాట్లాడి కబ్జాకు గురైన రహదారిని పరిశీలించి సంబంఽ దిత వెంచరుయజమానులకు నోటీసులు జారీచేసి రెండు రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా  బీజేపీ నాయకులు సీబీ వెంకటేష్‌, శ్రీకాంత్‌, భాస్కర్‌, రమేష్‌, బెజ్జు జైపాల్‌, వెంకట్‌ రాములు, కాంగ్రెస్‌ నాయకులు తుడుం శ్రీనివాస్‌, భాను నాయక్‌, ఏబీవీపీ నాయకులు మల్లేష్‌, ఎస్సీ పరిరక్షణ సమితి నాయకులు పోకల లక్ష్మణ్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-27T03:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising