అంబేడ్కర్ విగ్రహాన్ని ఢీకొట్టిన 104 వాహనం
ABN, First Publish Date - 2020-12-15T05:34:12+05:30
గజ్వేల్, డిసెంబరు 14 : మద్యం మత్తులో ఉన్న 104 వాహన డ్రైవర్ గజ్వేల్ మండలంలోని జాలిగామలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఢీకొట్టాడు.
నలుగురికి గాయాలు, గజ్వేల్ ఆస్పత్రికి తరలింపు
డ్రైవర్‌పై కేసు నమోదు
క్షతగాత్రులను పరామర్శించిన వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, డిసెంబరు 14 : మద్యం మత్తులో ఉన్న 104 వాహన డ్రైవర్ గజ్వేల్ మండలంలోని జాలిగామలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఢీకొట్టాడు. వివరాల్లోకి వెళ్తే గజ్వేల్ పట్టణం నుంచి దౌల్తాబాద్ మండలానికి 104 వాహనంలో డ్రైవర్ సంతో్‌షగౌడ్ సిబ్బంది సునీతను తీసుకెళ్తున్నాడు. జాలిగామ గ్రామంలోని మూలమలుపు వద్ద గల అంబేడ్కర్ విగ్రహాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో విగ్రహం వద్ద బస్సు కోసం వేచిచూస్తున్న గ్రామానికి చెందిన ఎం.నర్సింహులు, జీ.పోచయ్య, నవ్య (10)కు గాయాలయ్యాయి. అంతేకాకుండా వాహనంలో ఉన్న 104 సిబ్బంది సునీత కూడా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామస్థులు ఆగ్రహంతో 104 వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. ఎస్‌ఐ సంగమేశ్వర్, రాయపోల్ ఎస్‌ఐ మహబూబ్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులను శాంతింపజేశారు. ఇదిలా ఉండగా గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో క్షతగాత్రులను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ సంతో్‌షగౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ పోలీ్‌సస్టేషన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు.
Updated Date - 2020-12-15T05:34:12+05:30 IST