ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎం దొంగల అరెస్ట్‌

ABN, First Publish Date - 2020-09-06T10:06:59+05:30

అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిఽధిలోని కిష్టారెడ్డిపేటలో ఈ నెల 2న ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగలను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిందితుల నుంచి గ్యాస్‌ కట్టర్‌, ద్విచక్ర వాహనం స్వాధీనం


పటాన్‌చెరు, సెప్టెంబరు 5: అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిఽధిలోని కిష్టారెడ్డిపేటలో ఈ నెల 2న ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగలను పటాన్‌చెరు పోలీసులు పట్టుకున్నారు. పటాన్‌చెరు సీఐ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారు జామున పోలీసు స్టేషన్‌ పరిధిలోని రుద్రారం జాతీయ రహదారిపై యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో గుర్తుతెలియని ఇద్దరు దొంగలు చోరీకి యత్నిస్తుండగా అదే సమయంలో పెట్రోలింగ్‌ చేస్తున్న పటాన్‌చెరు ఎస్‌ఐ రామునాయుడు సిబ్బందితో అక్కడికి చేరుకుని, నిందితులను అరెస్ట్‌ చేసి విచారించారు. రామచంద్రాపురం పట్టణంలోని శ్రీనివా్‌సనగర్‌ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ఖాలీద్‌(30), బీరంగూడ వందనపురి కాలనీ అంజనీహోమ్స్‌లో నివాసం ఉండే ఎరుకల మహేష్‌(32) డబ్బు సంపాదనకు ఏటీఎంలను కొల్లగొట్టడం ప్రారంభించారు.


ఈ నెల 2వ తేదీన కిష్టారెడ్డిపేట హెచ్‌డీఎ్‌ఫసీ ఏటీఎం దొంగతనంతో పాటు గత జూన్‌ 8న పటాన్‌చెరు బస్టాండ్‌ వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ ఏటీఎం, జూన్‌ 19న ముత్తంగి కోటక్‌మహేంద్రా ఏటీఎం, 30న అదే గ్రామంలోని మరో కోటక్‌ మహేంద్ర ఏటీఎంలో, సెప్టెంబర్‌ 1న పటాన్‌చెరు పంజాబ్‌నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎంలో తామే దొంగతనాలకు పాల్పడ్డామని నిందితులు అంగీకరించారు. ఇప్పటి వరకు మొత్తం 6 ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడ్డారు. కరోనాతో ఉపాధి కోల్పోయి చోరీలకు పాల్పడ్డామన్నారు. యూట్యూబ్‌లో ఏటీఎంను తొలగించే విధానం పరిశీలించామని తెలిపారు. నిందితుల నుంచి గ్యాస్‌కట్టర్‌, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.  నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని సీఐ తెలిపారు.

Updated Date - 2020-09-06T10:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising