పెండింగ్ కేసులు లేకుండా చర్యలు: ప్రశాంత్‌రెడ్డి
ABN, First Publish Date - 2020-12-16T00:02:27+05:30
రిజిస్ర్టేషన్లకు సంబంధించి... వారం రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రారంభంలో సమస్యలు ఉన్నా రిజిస్ర్టేషన్లు పుంజుకుంటున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్: రిజిస్ర్టేషన్లకు సంబంధించి... వారం రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ప్రారంభంలో సమస్యలు ఉన్నా రిజిస్ర్టేషన్లు పుంజుకుంటున్నాయని పేర్కొన్నారు. రద్దీ ఆధారంగా రిజిస్ర్టేషన్ల కార్యాలయాలను నాలుగు విభాగాలుగా చేశామని వ్యాఖ్యానించారు. పలు కార్యాలయాలకు ఎక్కువ మంది రిజిస్ర్టార్లు, సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న రిజిస్ర్టేషన్లను త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు. మార్చి వరకు ఎలాంటి పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రిజిస్ర్టేషన్లకు సంబంధించి అన్ని వర్గాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించామని వివరించారు. రిజిస్ర్టేషన్లపై బ్యాంకులకు ఉన్న అపోహలను తొలగిస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
Updated Date - 2020-12-16T00:02:27+05:30 IST