ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొండపాడులో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

ABN, First Publish Date - 2020-12-21T06:17:55+05:30

చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌ ఆవ రణలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.

ధ్వంసమైన విగ్రహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలపాలెం/ మేళ్లచెర్వు డిసెంబరు 20: చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌ ఆవ రణలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మాల మహానాడు, ఏమ్మార్పీఎస్‌ నాయకులు విగ్రహం వద్ద రోడ్డుపై ఆదివారం బైఠాయించారు. సంఘటన స్థలాన్ని కోదాడ సీఐ శివారాంరెడ్డి పరిశీలించారు. దుం డగులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నా విరమించారు. కా ర్యక్రమంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు విజయ్‌, ఏమ్మార్పీఎస్‌ మండల అధ్య క్షుడు రమేష్‌, బాలా చంద్రుడు, శివ, సురేందర్‌ పాల్గొన్నారు. చింతలపాలెం మండ లంలోని దొండపాడులో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం, ఎమ్మార్పీఎస్‌, మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో మేళ్లచెర్వు మండలకేంద్రంలో రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వట్టెపు సైదులు, చెడపంగు శ్రీకాంత్‌, రవి, మాడుగుల రవిరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-21T06:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising