విద్యుదాఘాతంతో రైతు..
ABN, First Publish Date - 2020-12-15T06:33:18+05:30
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ మండలం రసూల్‌పుర గ్రామంలో సోమవారం జరిగింది.
నల్లగొండ జిల్లా రసూల్‌పుర గ్రామంలో ఘటన
నల్లగొండ క్రైం, డిసెంబరు 14: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ మండలం రసూల్‌పుర గ్రామంలో సోమవారం జరిగింది. నల్లగొండ రూరల్ ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రసూల్‌పుర గ్రామానికి చెందిన గుండెబోయిన పున్నయ్య (54) గ్రామ శివారులో ని వ్యవసాయ భూమిలో ఉన్న మోటర్‌కు విద్యుత్ సరఫరా రానందున సర్వీసు వైరు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-12-15T06:33:18+05:30 IST