ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు ఇబ్బంది కలిగిస్తే మిల్లర్లపై పీడీ యాక్ట్‌

ABN, First Publish Date - 2020-04-14T11:13:09+05:30

ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే పీడీయాక్ట్‌ నమోదు చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధికారులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ / మిర్యాల గూడ / గుర్రంపోడు / నాగార్జునసాగర్‌,  ఏప్రిల్‌ 13 : ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే పీడీయాక్ట్‌ నమోదు చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధికారులను ఆదేశించారు. సో మవారం ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ధాన్యానికి గ్రేడ్‌ నిర్ణయించాల్సింది అధికారులు, ఐకేపీ, పీఏసీఎస్‌ అధికారులేనన్నారు.


కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలన్నారు. సిమెం ట్‌ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా ఎలా వచ్చిందో మూలాలు వెతకాలన్నారు. సిమెంట్‌ పరిశ్రమకు చెందిన ఉద్యోగికి  కరోనా వచ్చినందున నియోజకవర్గమంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వైర్‌సపై అవగాహన కోసం మిర్యాలగూడ పట్టణంలో రోడ్లపై చిత్రాలు వేసిన చిత్రకారులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అభినందించారు.


సోమవారం ఆయన మునిసిపల్‌ చైర్మన్‌ భార్గవ్‌తో కలిసి ఇంట్లోనే వుందాం కరోనాను తరిమేద్దాం పెయింటింగ్‌ పరిశీలించారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పరిశీలించారు. రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నందికొండ మునిసిపాలిటీ ఏర్పాట్లపై ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కౌన్సిలర్లతో కలిసి మునిసిపల్‌ కార్యాలయంలో సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆర్డీఓ రోహిత్‌సింగ్‌కు సూచించారు. 

Updated Date - 2020-04-14T11:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising