దైవ దర్శనానికి వెళుతుండగా..
ABN, First Publish Date - 2020-12-15T06:09:03+05:30
దైవ దర్శనానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నల్లగొండ - దేవర కొండ ప్రధాన రహదారిపై గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామ శివారులో సోమ వారం సాయంత్రం జరిగింది.
నిద్రలో బైక్ నుంచి జారి కిందపడి..
గుర్రంపోడు, డిసెంబరు 14: దైవ దర్శనానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నల్లగొండ - దేవర కొండ ప్రధాన రహదారిపై గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామ శివారులో సోమ వారం సాయంత్రం జరిగింది. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. అమావాస్య సందర్భంగా చెర్వుగట్టు దేవాల యంలో నిద్ర చేయడానికి నాగ ర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం గ్రామానికి చెందిన పోతరాజు పోచమ్మ(42) హనుమాన్ మాలధారణ దీక్షలో ఉన్న కుమారుడు ఆంజనేయులు బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలో కొప్పోలు శివారులో పోచమ్మ నిద్ర మత్తులోకి వెళ్లి బైక్‌పై నుంచి జారి కింద పడింది. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావటంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు పోచమ్మ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుమారుడు అప్రమత్తం చేసినా..
కుమారుడి బైక్ వెనుక కూర్చున్న పోచమ్మ దేవరకొండ సమీపంలో ఓసారి నిద్రలోకి జారుకుంది. కుమారుడు అప్రమత్తం చేయగా తేరుకుంది. కొప్పోల్ శివారులో మరోమారు నిద్రమత్తులోకి వెళ్లి బైక్ నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు కాపాడుకోలేకపోయానని కుమారుడు తల్లి మృతదేహం వద్ద రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.
Updated Date - 2020-12-15T06:09:03+05:30 IST