కార్మికుల సహనాన్ని పరీక్షించొద్దు: గొంగిడి మహేందర్‌రెడ్డి
ABN, First Publish Date - 2020-12-15T06:43:18+05:30
కార్మికుల సహనాన్ని పరీక్షించొద్దని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. మండలంలోని పెద్దకందుకూర్ ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కార్మికుల దీక్షలు సోమవారం నాటికి 13వ రోజుకు చేరాయి.
యాదాద్రి రూరల్, డిసెంబరు 14: కార్మికుల సహనాన్ని పరీక్షించొద్దని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. మండలంలోని పెద్దకందుకూర్ ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కార్మికుల దీక్షలు సోమవారం నాటికి 13వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి దీక్షలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు శాంతియుతంగా దీక్షలు చేపడుతున్నప్పటికీ యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శించడం సిగ్గుచేటని అన్నారు. కార్మికులు సహనాన్ని పరీక్షించొద్దని తదుపరి జరిగే పరిణామాలకు మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. అంతకు ముందు ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్ దీక్షలకు మద్దతు తెలిపారు. దీక్షల్లో బి.నాగయ్య, శంకర్, పి.సత్యానంద, ఎస్.నర్సింహులు, వి.పాపయ్య కూర్చున్నారు.
Updated Date - 2020-12-15T06:43:18+05:30 IST