ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ నాణ్యతా ప్రమాణాల అవార్డుకు ఎంపిక

ABN, First Publish Date - 2020-03-15T12:01:08+05:30

మండల కేంద్రంలోని పీహెచ్‌సీ జాతీయ నాణ్యతా ప్రమాణాల అవార్డుకు ఎంపిక కావడంతో కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొమ్మలరామారం, మార్చి14 : మండల కేంద్రంలోని పీహెచ్‌సీ జాతీయ నాణ్యతా ప్రమాణాల అవార్డుకు ఎంపిక కావడంతో కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్స్‌ అండ్‌ మిషన్‌తో రూ.2లక్షల రివార్డు పొందిందని ఎంపీపీ సుధీర్‌రెడ్డి  తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆరోగ్య శాఖ తరపున నివేదిక వినిపించక ముందే ఈ వార్డు గురించి చర్చించి అభినందనలు తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది  జూన్‌ రెండోవారంలో జాతీయ తనిఖీ బృందం మూడు రోజుల పాటు ఆస్పత్రిని సందర్శించి కేంద్ర ప్రభుత్వ నా మ్స్‌ ప్రకారం నిర్వహిస్తున్న 50రకాల ప్రోగ్రామ్స్‌, ఆస్పత్రి నిర్వహణపై తనిఖీ చేశారు. తనిఖీ బృందం ఇచ్చిన 80శాతం మార్కులతో 2లక్షల రివార్డు పొందిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 54 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు గత అక్టోబరు9న ఎంపిక చేసి ప్రకటించారన్నారు. ఈ అవార్డు   జిల్లాలో బొమ్మలరామారం మండలంతో పాటు బీబీనగర్‌ మండలంలోని కొండమడుగు గ్రామంలో గల ఆరోగ్య కేంద్రాని వచ్చిందని తెలిపారు. రూ.2లక్షలు జిల్లా వైద్యశాఖ ఖాతాలో జమకాగా ఈ రెండు మూడు రోజుల్లో ఆ రోగ్య కేంద్రాల ఖాతాలకు ఇస్తారని వచ్చిన 2లక్షలతో 20శాతం ఆస్పత్రిలో  పని చేస్తున్న సిబ్బందికి మిగిలిన 80శాతం ఆస్పత్రి మెయింటనెన్స్‌  ఖర్చులకు ఉపయోగించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-15T12:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising