ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెహ్రూ జూ పార్క్ కు ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్

ABN, First Publish Date - 2020-12-17T00:39:22+05:30

అత్యంత నాణ్యమైన ప్రమాణాలను పాటిస్తూ, అందరి ప్రశంసలు పొందుతున్న నెహ్రు జూలాజికల్ పార్కు ఐఎస్ఓ పొందడం ఎంతో హర్షణీయం అన్నారు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అత్యంత నాణ్యమైన ప్రమాణాలను పాటిస్తూ, అందరి ప్రశంసలు పొందుతున్న నెహ్రు జూలాజికల్ పార్కు ఐఎస్ఓ పొందడం  ఎంతో హర్షణీయమని  అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అన్నారు జూ పార్కులో ప్రతీ విభాగంలో పాటించబడుతున్న ఐఎస్ఓ ప్రమాణాలను గుర్తించి వారికి ఈ సర్టిఫికెట్ ప్రధానం చేయటం జరిగిందని మంత్రి తెలిపారు.ముఖ్యంగా శానిటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, యానిమల్ బ్రీడింగ్, జూ హాస్పిటల్, యానిమల్ కేర్, హైజీన్ మెయిన్టెనెన్స్ ఎస్టాబ్లిషమెంట్ లను ఐఎస్ఓ నిపుణుల బృందం తనిఖీ చేసింది.


ఈ బృందం అన్ని విషయాలతో పాటు, వివిధ విభాగాల్లో పాటిస్తున్న ప్రమాణాలను కూడా పరిశీలించింది. జూ సిబ్బంది సమర్థవంతంగా, అంకితభావంతో పనిచేయటం, జంతువుల పట్ల మానవతా దృక్పధం తో సేవలందించుట నిపుణులకు బాగా నచ్చిన విషయాలు. ప్రతి పనిలో పారదర్శకత, 24 గంటల అన్ని అత్యవసర పరిస్థితులలో సిబ్బంది స్పందించే విధానం  గొప్పగా ఉందని నిపుణుల బృందం అభిప్రాయపడింది.


ఈ సమాచారాన్ని, గణాంకాలను  యుకె అ్ర్ర్రకిడేషన్ వారికి పంపించి, నెహ్రు జూలోజికల్ పార్కు ఐఎస్ఓ పొందటానికి చాలా ఖచ్చితమైన సిఫార్సు పంపటం జరిగింది. యూకే అక్రిడియేషన్ కమిటీ ఇవన్నీ పరిశీలించి, ముఖ్యంగా జూ సందర్శకుల సంతృప్తిని కూడా పరిగణలోకి తీసుకుని సర్టిఫికేషన్ ప్రదానం కోసం  అప్రూవల్ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో 24 గంటలు పని చేసిన  సిబ్బంది  యొక్క  నిబద్ధత, పాటించిన శుభ్రతా  చర్యలు  చాలా హర్షణీయమని కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్. శోభ అభినందించారు.


అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ, ఐఎస్ఓ  పొందిన మొట్ట మొదటి జూ దేశంలోనే నెహ్రు జూలాజికల్ పార్కు కావటం గర్వకారణం అన్నారు.సర్టిఫికేషన్ ప్రదాన కార్యక్రమంలో ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి,  జూ డైరెక్టర్ సిద్దానంద్ కుక్రేటీ, జూ క్యూరేటర్ ఎన్. క్షితిజ, డిప్యూటీ డైరెక్టర్ వెటర్నిటీ డాక్టర్ ఎం.ఏ. హకీమ్, సర్టిఫైడ్ ఆడిటర్ శివయ్య ఆలపాటి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-17T00:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising