ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండుకుండలా మారిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

ABN, First Publish Date - 2020-09-13T09:25:09+05:30

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెండోర, సెప్టెంబరు 12: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రాజె క్టుల గేట్లను ఎత్తడంతో ప్రాజెక్టులోకి 26,117 క్యూసెక్కుల వరదనీ రు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందని ఈఈ రామారావు తెలిపారు. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 1090.6 అడుగులకు చేరిందని పేర్కొ న్నారు. ప్రాజెక్టులోకి ఉదయం 31,425 క్యూసెక్కుల వరదనీరు రా గా ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరడంతో ప్రాజెక్టు నుంచి ప్ర ధాన కాలువకు 17,493 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 300 క్యూసెక్కులు, సరస్వతీ కా లువకు 600 క్యూసెక్కులు, అలీసాగర్‌, గుత్పకు 945 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ కు 152 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో పోతోందని ఈఈ తెలిపారు.


ప్రాజెక్టు నుంచి ఆవిరి రూపంలో 675 క్యూసెక్కులు పో తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రానికి 1090.6 (88.11టీ ఎంసీలు)అడుగుల నీటి నిల్వ ఉందన్నారు. గత ఏడాది ఇదే రోజు 1071.50అడుగుల (32.061టీఎంసీ) నీటి నిల్వ ఉందన్నారు. జూన్‌ 1వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి 88.618 టీఎంసీల నీరు వచ్చి చేరిం దని డీఈ తెలిపారు. 


జెన్‌కోలో కొనసాగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి

శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 6వేల క్యూసె క్కుల నీటి విడుదల కొనసాగుతుండడంతో జెన్‌కోలో విద్యుత్‌ ఉత్ప త్తి ప్రారంభమైందని జెన్‌కో డీఈ శ్రీనివాస్‌ తెలిపారు. విద్యుత్‌ ఉ త్పత్తి కేంద్రంలో మూడు టర్బయిన్‌ల ద్వారా 19.8 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నట్టు ఆయన వివరించారు.

Updated Date - 2020-09-13T09:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising