ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

47 మంది శాంపిల్స్‌లో 45 మందిలో కరోనా వైరస్‌ లేదు

ABN, First Publish Date - 2020-03-04T21:08:09+05:30

కోరానా వైరస్‌ (కొవిడ్‌-19) కలకలం హైదరాబాద్‌ వాసుల్లో వణుకు పుట్టిస్తోంది. అయితే గాంధీ ఆస్పత్రిలో మంగళవారం 47 మందికి కొవిడ్‌-19 శాంపిల్స్‌ సేకరించగా ఇందులో 45 మందికి వైరస్‌ సోకలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కోరానా వైరస్‌ (కొవిడ్‌-19) కలకలం హైదరాబాద్‌ వాసుల్లో వణుకు పుట్టిస్తోంది. అయితే గాంధీ ఆస్పత్రిలో మంగళవారం 47 మందికి కొవిడ్‌-19 శాంపిల్స్‌ సేకరించగా ఇందులో 45 మందికి వైరస్‌ సోకలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. ఆశాఖ బుధవారం విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా మరో రెండు నమూనాలను పూణెలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపినట్టు అధికారులు తెలిపారు. గురువారం నాటికి దీనికి సంబంధించిన రిపోర్ట్‌ వస్తుందని తెలిపారు. కొవిడ్‌-19 పాజిటివ్‌ సోకిందన్న అనుమానంతో ఇద్దరిని ఇప్పటికేగాంధీ ఆస్పత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో ఉంచారు. ఇప్పటికే ఒక వ్యక్తివిదేశీ ప్రయాణం చేసిన కారణంగా వైరస్‌సోకిందన్నఅనుమానం కాగా, మరో వ్యక్తి  ఇప్పటికే కొవిడ్‌-19 పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నాడు. గాంధీలో 45 మంది నమూనాల్లో నెగిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు అధికారులు తెలిపారు. అయినా వారంతా 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఇప్పటికే వైరస్‌పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో ఐసొటేషన్‌వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 


Updated Date - 2020-03-04T21:08:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising