ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళం ప్రకటించిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్

ABN, First Publish Date - 2020-03-31T23:31:12+05:30

ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తన వొంతు సహాయాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తన వొంతు సహాయాన్ని అందించేందుకు ప్రముఖ ఎలెక్ట్రిక్ మొబిలిటీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ముందుకొచ్చింది. పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళంగా రూ.17,26,664లను విరాళంగా అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చిన రూ.7,26,664లకు సంస్థ మరో రూ.10లక్షలను జోడించి ఈ మొత్తాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు అందజేయనుంది. ఒలెక్ట్రా యొక్క మాతృ సంస్థ ఎంఈఐఎల్ ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు 13 కోట్ల రూపాయలను అందించింది.


‘‘కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి, నరేంద్ర మోదీ మరియు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ విజయవంతంగా అమలు చేయడంతో, ఘోరమైన వైరస్‌ను ఎదుర్కోవడానికి భారతదేశం ప్రపంచాన్ని సమర్థవంతమైన మార్గాన్ని చూపుతోంది. ఈ సంక్షోభ సమయంలో, ఈ చిన్న సహకారంతో, మేము ప్రభుత్వానికి సంఘీభావంగా నిలబడతాము మరియు సాధ్యమైనంత తక్కువ సమయంలో పరిస్థితి మెరుగుపడుతుందని మరియు దేశం త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నాము ”అని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.నాగసత్యం అన్నారు.

Updated Date - 2020-03-31T23:31:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising