ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నులు చెల్లించండి.. బహుమతులు గెలుచుకోండి

ABN, First Publish Date - 2020-03-15T10:39:38+05:30

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రజల నుంచి పన్ను లు రాబట్టడానికి ఓ వినూత్న పథకానికి శ్రీకా రం చుట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెగడపల్లి గ్రామ పంచాయతీలో వినూత్న పథకం

కాల్వశ్రీరాంపూర్‌, మార్చి 14: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రజల నుంచి పన్ను లు రాబట్టడానికి ఓ వినూత్న పథకానికి శ్రీకా రం చుట్టింది. పన్నులు చెల్లించండి.. బహుమతు లు గెలుచుకోండి అంటూ బ్రోచర్లను ముద్రించి వార్డుల్లో పంపిణీ చేసింది. గ్రామపంచాయతీలో రూ.13లక్షల పన్నుల బకాయిలు రావాల్సి ఉంది. పాత బకాయిలు కూడా వసూలు కాకపోవడం తో గ్రామసర్పంచ్‌, పాలకవర్గం కలిసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈనెల 24లోపు పన్నులను చెల్లించిన వారికి బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుందని పోస్టర్లను ముద్రిం చి ఇంటింటికీ పంపిణీ చేశారు. మొదటి బహుమతి అర తులం బంగారం, రెండో బహుమతి పావు తులం బంగారం, మూడో బహుమతి 10 తులాల వెండి, 4వ బహుమతి 5తులాల వెండి, 5వ బహుమతి 3 తులాల వెండి, అలాగే ఐదుగురికి ప్రెషర్‌ కుక్కర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో స్పందించిన గ్రామస్థులు పన్నులు చెల్లించడం ప్రారంభించారు. శనివారం నాటికి రూ.4.20 లక్షల పన్నులు వసూలయ్యాయని సర్పంచ్‌ ఆరెల్లి సుజాత తెలిపారు. ఈనెల 25న ఉగాది పండుగ రోజున డ్రా తీసి బహుమతులను అందజేస్తామని తెలిపారు. ఈ బహుమతులకయ్యే ఖర్చును సర్పంచ్‌ సొంతంగా భరించేందుకు ముందుకొచ్చారు.

Updated Date - 2020-03-15T10:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising