ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ కమిషనర్లు చట్టానికి అతీతులు కారు

ABN, First Publish Date - 2020-11-19T07:47:52+05:30

పోలీసు కమిషనర్లు చట్టానికి అతీతులేమీ కాదని, ఖాకీ యూని ఫాం కాకుండా గులాబీ యూనిఫాం వేసుకుని పనిచేస్తామంటే బరాబర్‌ ఎదిరిస్తామని, నిలదీస్తామని దుబ్బాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ ముగ్గురు ఇష్టారీతిన వ్యవహరించారు

గులాబీ యూనిఫాంలో పనిచేస్తామంటే ఎదిరిస్తాం

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం

 హైదరాబాద్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): పోలీసు కమిషనర్లు చట్టానికి అతీతులేమీ కాదని, ఖాకీ యూని ఫాం కాకుండా గులాబీ యూనిఫాం వేసుకుని పనిచేస్తామంటే బరాబర్‌ ఎదిరిస్తామని, నిలదీస్తామని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా.. సిద్దిపేట, హైదరాబాద్‌, రాచకొండ కమిషనర్లు వారే చట్టాలను తెచ్చినట్లుగా వ్యవహరించారని విమర్శించారు. ఎంపిక చేసిన వాహనాలు, ఇళ్లను మాత్రమే తనిఖీ చేశారని ఆరోపించారు. తనిఖీ నోటీసు ఇవ్వకుండా మీ బ్యూరోక్రాట్ల నివాసాల్లో ఇలాగే తనిఖీలు చేస్తారా? అని ప్రశ్నించారు.


దుబ్బాక ఎమ్మెల్యేగా బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ స్పీకర్‌ చాంబర్‌లో ప్రమాణం చేసిన రఘునందన్‌.. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఇలాంటివారితోనే మా పంచాయితీ తప్ప మిగతావారితో కాదు. ఆ అపప్రఽథ తొలగించుకోండి. ప్రజలు దాడిచేసే పరిస్థితి తెచ్చుకోవద్దు’’ అని రఘునందన్‌ హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ పేరిట కేసులు పెడతామంటే చట్టం తెలిసిన వ్యక్తిగా అడ్డుకుని తీరతానన్నారు. టీఆర్‌ఎ్‌సకు ట్రబుల్‌ షూటరే సమస్యగా మారారా? ఆయన్ను సాగనంపేందుకు కుట్ర జరిగిందా? అని మంత్రి హరీశ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 



కాషాయ దుస్తుల్లో ప్రమాణ స్వీకారం

రఘునందన్‌రావు బుధవారం అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి ఆయన కాషాయ దుస్తుల్లో వచ్చారు. మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం.. దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు రఘునందన్‌ తెలిపారు.


అంతకుముందు గన్‌ పార్కులో తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. కాగా, జీహెచ్‌ఎంసీలో వరద సాయాన్ని బీజేపీ అడ్డుకుంటోందంటూ సీఎం కేసీఆర్‌ ఆరోపించడాన్ని బీజేవైఎం ఖండించింది. గురువారం సీఎం దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు ప్రకటించింది.


Updated Date - 2020-11-19T07:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising