ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలానగర్‌, కూకట్‌పల్లిలో డీఐఈవో తనిఖీ

ABN, First Publish Date - 2020-03-12T06:33:25+05:30

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగానే జరుగుతున్నాయి. బుధవారం ద్వితీయ సంవత్సరం గణితం పేప ర్‌- 2ఏ, బాటనీ- 2, సివిక్స్‌- 2

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ అర్బన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగానే జరుగుతున్నాయి. బుధవారం ద్వితీయ సంవత్సరం గణితం పేప ర్‌- 2ఏ, బాటనీ- 2, సివిక్స్‌- 2 పరీక్షలను నిర్వహించారు. 55,685 మంది విద్యార్థులకు 54,414 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 1271 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. డీఐఈవో ఆర్‌.భాస్కర్‌ బాలానగర్‌, కూకట్‌పల్లి మండలాల్లోని ఇందు, కైట్స్‌, శ్రీఆదర్శ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

54,414 మంది విద్యార్థులు హాజరు

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 54,414 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అల్వాల్‌ మండలంలోని 7 పరీక్ష కేంద్రాల్లో 3,141 మందికి 96 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. బాచుపల్లిలో 18 కేంద్రాల్లో 11,166 మందికి120 మంది గైర్హాజరయ్యారు. బాలానగర్‌లోని 2 కేంద్రాల్లో 1,016 మందికి  నలుగురు, దుండిగల్‌ గండిమైసమ్మలోని 3 కేంద్రాల్లో 665 మందికి 34 మంది, ఘట్‌కేసర్‌లోని 5 కేంద్రాల్లో 2,058 మందికి 52 మంది పరీక్షలు రాయలేదు.


కాప్రాలోని 12 కేంద్రాల్లో 5,065 మందికి 130 మంది, కీసరలోని 3 కేంద్రాల్లో 564 మందికి 49 మంది, కూకట్‌పల్లిలోని 28 కేంద్రాల్లో 14,130 మందికి 243 మంది గైర్హాజరయ్యారు. మల్కాజిగిరిలోని 3 కేంద్రాల్లో 788 మందికి  27 మంది, మేడ్చల్‌లోని 5 కేంద్రాల్లో 1,763 మందికి 107 మంది, మేడిపల్లిలోని 9 కేంద్రాల్లో 3,846 మందికి 62 మంది, కుత్బుల్లాపూర్‌లోని 11 కేంద్రాల్లో 4,899 మందికి 219 మంది, శామీర్‌పేటలోని 3 కేంద్రాల్లో 926 మందికి 22 మంది, ఉప్పల్‌లోని 13 కేంద్రాల్లో 5,658 మందికి 106 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.


Updated Date - 2020-03-12T06:33:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising