రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
ABN, First Publish Date - 2020-12-15T05:56:02+05:30
రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
శామీర్‌పేట: రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ ఎల్లూబాయి అన్నారు. శామీర్‌పేట పెద్ద చెరువు వద్ద హైలెవల్ కెనాల్ ద్వారా అలియాబాద్, జగ్గంగూడ గ్రామాల ఆయకట్టు రైతులకు యాసింగి సీజన్‌కు సాగునీటిని సోమవారం సర్పంచ్ కుమార్‌తో కలిసి విడుదల చేశారు. విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ శామీర్‌పేట పెద్ద చెరువుకు కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్టు ద్వారా నింపి మండలంలోని అన్ని గ్రామాల రైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలను తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సమస్యను మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని ఎంపీపీ తెలిపారు. మండల ఇరిగేషన్ ఏఈ కన్నయ్య, వర్క్ ఇన్‌స్పెక్టర్ వాసుదేవ్, క్రిష్ణారెడ్డి, కుమార్‌యాదవ్, సగ్గు శ్రీనివాస్, అశోక్, ప్రభాకర్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-15T05:56:02+05:30 IST