ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే..మస్కు నర్సింహ మృతి

ABN, First Publish Date - 2020-07-28T09:57:45+05:30

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం : ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతూ నగరంలోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు కందుకూరు మండలం కొలన్‌గూడకు చెందిన అరుణతో 1988లో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులున్నారు. 


యాచారం మండలం చిన్నతూండ్ల గ్రామంలో పెంటయ్య, లక్ష్మమ్మ దంపతులకు 1973లో నర్సింహ జన్మించారు. ఆయన 1988లో నందివనపర్తి పదో తరగతి చదివారు. ఇంటర్‌మీడియట్‌ ఇబ్రహీంపట్నంలో పూర్తిచేశారు. నగరంలో డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. అనంతరం సీపీఎం పూర్తిస్థాయి కార్యకర్తగా పని చేశారు. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు చిన్నతూండ్ల ఎంపీటీసీగా పనిచేశారు. 2004నుంచి 2009 వరకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నర్రా రవికుమార్‌పై 12,807 ఓట్లతో విజయం సాధించారు.


తాగునీటి కోసం ఇబ్రహీంపట్నం నుంచి నగరం వరకు సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో చర్చించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి తాగునీరు అందించడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. ఎమ్మెల్యే పదవీకాలం ముగిసిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రెండేళ్లపాటు సీపీఐ ఇబ్రహీంపట్నం డివిజన్‌ నాయకుడిగా పని చేశారు. తిరిగి సీపీఎంలో చేరి పార్టీకోసం పూర్తికాలం పనిచేశారు. 


ముగిసిన అంత్యక్రియలు 

చిన్నతూండ్లలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు మస్కు నర్సింహ అంత్యక్రియలు జరిగాయి. నగరం నుంచి ప్రత్యేక వాహనంలో ఆయన పార్థివ దేహం గ్రామానికి తీసుకొచ్చి అంతిమయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సీపీఎం కార్యదర్శి డి.రాంచందర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, పార్టీ కోర్‌కమిటీ సభ్యుడు బి.సామేల్‌, మండల కార్యదర్శి బి.మధుసూదన్‌రెడ్డి, మండల కమిటీ సభ్యులు ఏ.నర్సింహ, పి.అంజయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 


కాగా, యాచారం మండల కేంద్రంలో సీపీఎం కార్య కర్తలు మస్కు నర్సింహ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరాట యోధుడిని కోల్పోయామని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కనర్సింహారెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి కె.బాష, యాచారం ఎంపీపీ కె.సుకన్యబాషా అన్నారు.

Updated Date - 2020-07-28T09:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising