ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలాల సాధనకు కొనసాగుతున్న రిలే దీక్షలు

ABN, First Publish Date - 2020-10-12T09:29:27+05:30

ముద్విన్‌ను మండల కేంద్రంగా ప్రకటించే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ గంప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల : ముద్విన్‌ను మండల కేంద్రంగా ప్రకటించే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ గంప వెంకటేష్‌ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని వారు పేర్కొన్నారు. ముద్విన్‌ గ్రామంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో  చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 26వ రోజుకు చేరాయి. దీక్షల్లో చంద్రశేఖర్‌ ఆజాద్‌ యూత్‌ సభ్యులు పొగాకు మహేష్‌, స్వామి, కృష్ణ, అంజి, వెంకట్‌, బీజేపీ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జగన్‌, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గడ్డమీది వెంకటయ్య, బీసీ సెల్‌ మాడ్గుల మండల అధ్యక్షుడు రమేష్‌ దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని దశరథ్‌నాయక్‌, గంప వెంకటేష్‌, రైతు సమన్వయ సమితి మండల కోఆర్టినేటర్‌ జోగు వీరయ్య, ఎంపీటీసీ లచ్చిరాం నాయక్‌, సర్పంచ్‌ నక్కపోతు యాదయ్యలు సందర్శించి దీక్షలకు సంఘీభావం తెలిపారు.  ముద్విన్‌ను మండల కేంద్రంగా ప్రకటించే వరకూ దీక్షలను కొనసాగిస్తామని జేఏసీ నాయకులు వెంకట్‌రెడ్డి, వెంకటయ్య, వినోద్‌, ఈర్లపల్లి యాదయ్య, మహేందర్‌, సురేష్‌, శేఖర్‌, వెంకటయ్య, న ర్సింహ తదితరులు పేర్కొన్నారు. 


31వరోజుకు చేరిన దీక్షలు

తలకొండపల్లి: గట్టిప్పలపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 31వ రోజుకు చేరాయి. దీక్షలో మాల మహానాడు నాయకులు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ జయమ్మ వెంకటయ్య, ఉప సర్పంచ్‌ బాలస్వామి నాయకులు దామోదర్‌, కృష్ణ, చెన్నయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, రేణురెడ్డి రాజేందర్‌, రమేష్‌, జంగయ్య, శ్రీశైలం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. 

Updated Date - 2020-10-12T09:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising