ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా విషయంలో తెలంగాణకు నేడు స్వల్ప ఊరట

ABN, First Publish Date - 2020-04-25T00:17:46+05:30

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణకు శుక్రవారం కాస్త ఊరట లభించింది. ఈ రోజు కేవలం 14 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి తెలంగాణకు శుక్రవారం కాస్త ఊరట లభించింది. ఈ రోజు కేవలం 13 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి తెలంగాణలో 983కి కరోనా పాజిటివ్‌ కేసులు చేరాయి.ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు కనిష్టంలోకి పడిపోతున్నాయి. రాష్ట్రంలో ఆశాజనక పరిస్థితితులు కనిపిస్తున్నాయి. గురువారం మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ నాలుగైదు రోజుల్లో కేసులు ఇంకా తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అన్నట్లుగానే... కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గురువారం 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. 


20వ తేదీ (సోమవారం) నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 20 తేదీ కూడా 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే మంగళవారం ఒక్కరోజే 56 కేసులు నమోదయ్యాయి. బుధవారం 15 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసులు కూడా జీహెచ్‌ఎంసీలో 10, సూర్యాపేటలో 3, గద్వాలలో 2 కరోనా పాజిటివ్‌లు వచ్చాయి. గురువారం 27 కరోనా పాజిటివ్‌ కేసులు, ఒకరు మృతి చెందారు. శుక్రవారం కూడా 13 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులను పరిశీలిస్తే మంగళవారం ఒక్క రోజును మినహాయిస్తే మిగిలిన రోజుల్లో కేసుల సంఖ్య కనిష్టంలోకి పడిపోయింది. కేసులు సంఖ్య తగ్గముఖం పట్టడంతో తెలంగాణ సమాజం ఆనందం వ్యక్తం చేస్తోంది. 

Updated Date - 2020-04-25T00:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising