బైక్‌లో పాము కలకలం
ABN, First Publish Date - 2020-12-15T19:05:00+05:30
అశ్వారావుపేటలో బైక్‌లో పాము కలకలం రేపింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేటలో బైక్‌లో పాము కలకలం రేపింది. నారాయణపురం నుంచి అశ్వారావుపేటకు బైక్‌పై వస్తున్న జక్కుల రాజుపై వాహనం లోంచి ఒక్కసారిగా పాము చేతిపైకి వచ్చింది. దీంతో వెంటనే అతను బైక్‌ను ఆపాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా.. స్థానికులు పామును బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే పాము బయటకు రాకపోవడంతో మెకానిక్ సహాయంతో బైక్ ఆయిల్ ట్యాంక్ విప్పడంతో పాము బయటపడింది. వెంటనే దాన్ని చంపేశారు.
Updated Date - 2020-12-15T19:05:00+05:30 IST