ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో పెరుగుతున్న కొత్త కరోనా స్ట్రెయిన్ అనుమానిత కేసులు

ABN, First Publish Date - 2020-12-25T23:50:51+05:30

తెలంగాణలో కొత్త కరోనా స్ట్రెయిన్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 16కు అనుమానిత పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కొత్త కరోనా స్ట్రెయిన్ అనుమానిత కేసులు  పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 16కు అనుమానిత పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. 16 మందితో అత్యంత సన్నిహితంగా ఉన్న.. 76 మందిని గుర్తించిన అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు. 1,200 మందిలో ఇప్పటివరకు 926 మందిని అధికారులు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్‌ను వైద్యులు సీసీఎంబీకి పంపారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా రెండోదశ కొనసాగుతోంది. ఇటీవల యూకే నుంచి తెలంగాణకు 1,200 మంది ప్రయాణికులు వచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 800 మంది యూకే వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో యూకే వెళ్లొచ్చిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల యూకే నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ పలువురు వచ్చినట్లు తెలుస్తోంది. యూకే నుంచి వచ్చిన వారి నుంచి శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్‌కు వైద్యులు పంపారు. సిద్దిపేటకు చెందిన ఓ మహిళకు ఆర్టీపీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే ఏ రకమైన కోవిడ్ లక్షణాలో నిర్దారించుకోడానికి వైద్యాదికారులు సీసీఎంబీకి శాంపిల్స్ పంపించారు. రెండు రోజుల్లో రిపోర్టు రానుంది. దీంతో సిద్దిపేట ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-12-25T23:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising