ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆంధ్రజ్యోతి’పై టీబీజీకేఎస్‌ అక్కసు

ABN, First Publish Date - 2020-12-24T08:10:28+05:30

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథనాన్ని నిరసిస్తూ పత్రిక ప్రతుల దహనం

టీబీజీకేఎస్‌ వైఖరిపై కార్మిక సంఘాల ఆగ్రహం

గోదావరిఖని/ఇల్లెందు, డిసెంబరు 23: సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) అక్కసు వెళ్లగక్కింది. స్వరాష్ట్రంలో సింగరేణికి ఏమీ ఒరగలేదని, ఉద్యమ ఆకాంక్షలన్నీ అడుగంటిపోయాయని, సీఎం కేసీఆర్‌ హామీలు నెరవేరలేదని ‘తెల్లబోయిన నల్ల నేల’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కాగా.. జీర్ణించుకోలేని టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణిలోని పలు ప్రాంతాల్లో పత్రిక ప్రతులను దహనం చేశారు.


సాంకేతిక గణాంకాలతో వివరాలను మాత్రమే ప్రచురించిన కథనానికే టీబీజీకేఎస్‌ తట్టుకోలేకపోయింది. టీబీజీకేఎస్‌ తీరు సరికాదంటూ పలు కార్మిక సంఘాలు స్పందించాయి. ఏఐటీయూసీ, బీఎంఎస్‌లు.. టీబీజీకేఎస్‌ చర్యను తప్పుపట్టాయి. ‘ఆంధ్రజ్యోతి’ కథనం అక్షర సత్యమని స్పష్టం చేశాయి. పత్రిక ప్రతుల దహనాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ అభివర్ణించింది.


కార్మికుల ఆకాంక్షలను ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించిందని, టీబీజీకేఎస్‌ నాయకత్వం ఉలిక్కిపడడం ఆ సంఘం వైఫల్యాలను తెలియజేస్తోందని బీఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మాధవనాయక్‌,  బీఎంఎస్‌ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు పర్లపల్లి రవి పేర్కొన్నారు. టీబీజీకేఎస్‌ తీరును కార్మికులు అసహ్యించుకుంటున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు మండిపడ్డారు. సింగరేణి పరిస్థితులను తేటతెల్లం చేసిన ‘ఆంధ్రజ్యోతి’కి ఐఎ్‌ఫటీయూ రాష్ట్రకోశాధికారి రాసుద్దీన్‌ అభినందనలు తెలిపారు. 


Updated Date - 2020-12-24T08:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising