ఎడ్లబండిపై ఊరేగిన అభిమానం
ABN, First Publish Date - 2020-12-22T04:14:32+05:30
ఎడ్లబండిపై ఊరేగిన అభిమానం
పదవీ విరమణ వేళ టీచర్‌కు ఘన సత్కారం
కేసముద్రం, డిసెంబరు 21 : ఉపాధ్యాయుడి బోధన తీరుతో విద్యార్థులతో పాటు గ్రామస్థులు ఆయనకు అభిమానులుగా మారారు. ఆయన బోధించిన సంస్కృతీ సంప్రదాయాలను అనుసరిస్తూ ఉద్యోగ విరమణ రోజున ఎడ్లబండిపై బ్యాండు మేళంతో గ్రామంలో ఊరేగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మండలంలోని ఇనుగుర్తి జడ్పీహైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పంజాల సోమనర్సయ్య 25 ఏళ్లుగా వివిధ పాఠశాలల్లో బోధించి ఈనెల 31న ఉద్యోగ విరమణ పొందుతున్నారు. అయితే సోమవారం పదవీ విరమణ సన్మాన సభను పాఠశాలలో నిర్వహించారు. కారులో ఈ సభకు వస్తున్న సోమనర్సయ్య, మల్లికాంబ దంపతులను గ్రామ పొలిమెరల్లోనే విద్యార్థులు, గ్రామస్థులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిలిపివేశారు. అక్కడి నుంచి అందంగా అలంకరించిన ఎడ్లబండిపై దంపతులను ఎక్కించి బ్యాండు మేళంతో ఊరేగింపుగా పాఠశాలకు తీసుకువచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Updated Date - 2020-12-22T04:14:32+05:30 IST