ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో రేపటి నుంచే ఆర్టీసీ బస్సులు

ABN, First Publish Date - 2020-05-18T19:13:04+05:30

తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే బస్సుల్లో 50శాతం ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని జిల్లాలో ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులను జేబీఎస్‌ వరకే  అనుమతించనున్నారు. వరంగల్‌ వెళ్లే బస్సులు ఉప్పల్‌ నుంచి, నల్గొండ వెళ్లే బస్సులు ఎల్బీనగర్‌ నుంచి అలాగే మహబూబ్‌నగర్‌ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్‌ నుంచి ప్రయాణించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి అంతర్‌రాష్ట్ర సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచే అంశంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.


ఇక ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రావాలంటే డిపోల్లో థర్మల్‌ స్క్రీన్‌ తప్పని చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని డిపోల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో అన్ని అంశాలపై పూర్తి క్లారిటీ రానుంది.

Updated Date - 2020-05-18T19:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising