ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రుణం ప్రైవేట్‌కే!

ABN, First Publish Date - 2020-05-18T09:52:46+05:30

ఎన్‌టీపీసీతోపాటు ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థల బకాయిలు చెల్లించడానికే ‘ఆత్మనిర్భర్‌’ కింద డిస్కమ్‌లకు రుణం దక్కనుంది. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి వీలుగా రూ.20 లక్షల కోట్లతో కేంద్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఎన్‌టీపీసీతోపాటు ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థల బకాయిలు చెల్లించడానికే ‘ఆత్మనిర్భర్‌’ కింద డిస్కమ్‌లకు రుణం దక్కనుంది. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి వీలుగా రూ.20 లక్షల కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో వివిధ డిస్కమ్‌లు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు బకాయి పడిన రూ.90,000 కోట్లకు రుణాలను కేంద్రం ఆఫర్‌ చేసింది. ఇక రూ.90 కోట్ల ఆఫర్‌లో చాలా మెలికలు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ సంస్థలు డిస్కమ్‌లకు ఎంత విద్యుత్‌ బిల్లులు బకాయి ఉన్నాయో అంత డిస్కమ్‌లు రుణం తీసుకునే వెసులుబాటుఉంది. దీనికి ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వాల్సిందే. ఇచ్చే రుణాన్నంతా ప్రైవేట్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల ఖాతాల్లోనే జమచేయనున్నారు. జెన్‌కోకు చిల్లిగవ్వ రాదు. సింగరేణికీ అనుమానమే. ప్రస్తుతం ఎల్‌సీ నిబంధన కింద సింగరేణికి ముందస్తు చెల్లింపుల్లేవు.  తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖలు డిస్కమ్‌లకు రూ.7,298 కోట్ల కరెంట్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆరేళ్లలో బకాయిలు రెండింతలు పెరిగాయి. వాస్తవానికి తెలంగాణ డిస్కమ్‌లు రూ.13 వేల కోట్ల కరెంట్‌ కొనుగోళ్లకు చెల్లింపులు చేయాల్సి ఉంది. రుణం తీసుకుంటే ఎన్‌టీపీసీ, ఛత్తీ్‌సగఢ్‌తో పాటు వివిధ ప్రైవేట్‌ సంస్థల బకాయిలు చెల్లించడానికి వెసులుబాటు లభించనుంది. 

Updated Date - 2020-05-18T09:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising