ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిట్టీల పేరిట మోసం.. ముగ్గురి అరెస్టు

ABN, First Publish Date - 2020-12-27T12:22:00+05:30

చిట్టీలు, ఫైనాన్స్‌ వ్యాపారం పేరుతో పలువురి నుంచి సుమారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/హైదర్‌ నగర్‌ : చిట్టీలు, ఫైనాన్స్‌ వ్యాపారం పేరుతో పలువురి నుంచి సుమారు రూ.2.5 కోట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా తప్పించుకుతిరుగుతున్న కుటుంబాన్ని కేపీహెచ్‌బీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ లక్ష్మినారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దుద్దిపట్ల గ్రామానికి చెందిన చేగొండి సూర్యనారాయణ, అతని భార్య కనకదుర్గ, కూతురు మాధురి కేపీహెచ్‌బీ కాలనీ జీపీఆర్‌ ఎస్టేట్స్‌లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.


స్థానికంగా ఉండే చిరువ్యాపారులు, ఉద్యోగులతో పరిచయాలు పెంచుకుని వారి నుంచిచిట్టీల పేరుతో డబ్బు వసూలు చేశారు. మొదట డబ్బులు సక్రమంగా చెల్లించడంతో పలువురు పెద్ద మొత్తంలో చిట్టీలు వేశారు. అనంతరం గడువు ముగిసినప్పటికీ చీటీ పాటపాడిన వారికి డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 38మంది నుంచి సుమారు రూ.2.5 కోట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా తప్పించుకుతిరుగుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందుతులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

Updated Date - 2020-12-27T12:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising