ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి లడ్డూ అమ్మకాలు కొనసాగించాలి

ABN, First Publish Date - 2020-06-04T21:48:37+05:30

తిరుమల తిరుపతి వెంకన్న స్వామి లడ్డూల అమ్మకాలను కొనసాగించాలని పెద్దసంఖ్యలో భక్తులు కోరుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి వెంకన్న స్వామి లడ్డూల అమ్మకాలను కొనసాగించాలని పెద్దసంఖ్యలో భక్తులు కోరుతున్నారు. గత రెండు మూడు రోజులుగా అమ్మకాలకు నగర వాసుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. పెద్దసంఖ్యలో భక్తులు లడ్డూల కోసం బారులు తీరారు. కానీ గురువారం లడ్డూల అమ్మకాలు నిలిని వేసినట్టు ఇక్కడ బోర్డులు కనిపించడంతో చాలా మంది ఎంతో ఆశతో వచ్చిన వారు నిరాశతో వెళ్తున్నారు. లాక్‌డౌన్‌నేపధ్యంలో తిరుమల వెళ్లడానికి కుదరదు. కనీసం స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు టీటీడీ అధికారులు నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఉన్న టీటీటీ దేవస్ధానంలో వీటి అమ్మకాలు ప్రారంభించారు.


లడ్డూ ధర 50 రూపాయల అయినా భక్తులకు 50 శాతం సబ్సీడీతో 25 రూపాయలకే విక్రయాలు ప్రారంభించారు. ప్రారంభం నుంచి కూడా భారీసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అమ్మకాల సమయంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిండం, మాస్క్‌లు ధరించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు 1.20 లక్షల లడ్డూల అమ్మకాలు జరిగినట్టు తెలిసింది. అయితే తిరుమల ఆలయాన్ని తెరువనున్న నేపధ్యంలోనే లడ్డూల అమ్మకాలను నిలిపి వేసినట్టు సమాచారం. ఆలయాన్ని తెరిచినా భక్తుల సౌకర్యార్తం నగరంలోనూ లడ్డూల అమ్మకాలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. 

Updated Date - 2020-06-04T21:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising