ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా

ABN, First Publish Date - 2020-11-19T20:31:17+05:30

గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో వేగంగా దూసుకుపోతున్న టీఆర్ఎస్.. తాజాగా తన రెండో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 105 మంది అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో వేగంగా దూసుకుపోతున్న టీఆర్ఎస్.. తాజాగా తన రెండో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 105 మంది అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్... మలి జాబితాలో మరో 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 125 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. 


రెండో జాబితాలో ఆరుగురు సిట్టింగ్ కార్పొరేటర్ల‌కు టీఆర్ఎస్ అధిష్ఠానం మొండి చేయి చూపింది. బాలానగర్ కార్పొరేటర్ కొండేటి నరేందర్ స్థానంలో రవీందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. వివేకానంద నగర్‌లో లక్ష్మీ భాయ్ స్థానంలో రోజా రంగ రావుకు ఛాన్స్ దక్కింది. అడ్డగుట్టలో విజయ కుమారి స్థానంలో ప్రసన్న లక్ష్మీకి చోటు దక్కగా, మెట్టుగూడలో భార్గవి స్థానంలో సునీత, బౌద్ధ నగర్‌లో ధనుంజన  భాయ్ స్థానంలో కంది శైలజ, బేగంపేటలో ఉప్పల తరుణి స్థానంలో మహేశ్వరి శ్రీహరికి అవకాశం దక్కింది. ఐదుగురు సిట్టింగ్‌లకు మరో ఛాన్స్ ఇచ్చింది. మైలార్ దేవర్ పల్లి సిట్టింగ్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడంతో ప్రేమ్ దాస్‌కు అవకాశం లభించింది. 


కాగా, డిసెంబర్ 1న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 



Updated Date - 2020-11-19T20:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising