ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొందాం

ABN, First Publish Date - 2020-05-18T09:17:03+05:30

వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా వ్యాధులను సమష్టిగా ఎదుర్కొందామని రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఇందుకు మునిసిపల్‌ శాఖ సిద్ధంగా ఉందని, ప్రతి ఒక్కరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 17(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా  వ్యాధులను సమష్టిగా ఎదుర్కొందామని రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఇందుకు మునిసిపల్‌ శాఖ సిద్ధంగా ఉందని, ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ మేయర్‌లు, మునిసిపల్‌ చైర్మన్‌లకు మంత్రి ఆదివారం లేఖ రాశారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఇళ్లల్లో, పరిసరాల్లో చేపట్టే పరిశుభ్రత కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై.. సీజనల్‌ వ్యాఽధుల నివారణ చర్యలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిఽధులు తమ ఇళ్ల నుంచే దీనిని ప్రారంభించాలని సూచించారు. కాగా, ఆదివారం మంత్రుల నివాస భవనాలకు సమీపంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఇంటింటికీ తిరిగి సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు. నిల్వ నీటిని స్వయంగా తొలగించారు. మంత్రి మల్లారెడ్డి తన ఇంటితో పాటు పరిసరాల్లోనూ నిలువ  నీటిని తొలగించారు. హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి కుటుంబ సభ్యులతో కలిసి చెత్తను ఏరి వేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి తన నివాసంలో పూల కుండీలను శుభ్రం చేసి తాజా నీటితో నింపారు. 

Updated Date - 2020-05-18T09:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising