తీపి పొంగలి
ABN, First Publish Date - 2020-01-15T20:17:53+05:30
కావలసిన పదార్థాలు: బియ్యం - అరకప్పు, పెసరపప్పు - అరకప్పు, జీడిపప్పు - 10, కిస్‌మిస్ - 10, యాలకులు - 10, బెల్లం - ఒక కప్పు, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు.
కావలసిన పదార్థాలు: బియ్యం - అరకప్పు, పెసరపప్పు - అరకప్పు, జీడిపప్పు - 10, కిస్‌మిస్ - 10, యాలకులు - 10, బెల్లం - ఒక కప్పు, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం: ముందుగా బియ్యం, పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీరుపోసి అరగంట పక్కనుంచాలి. నెయ్యిలో కిస్‌మిస్, జీడిపప్పులు వేగించి పక్కనుంచాలి. కడాయిలో బెల్లం వేసి ఒక కప్పు నీరు పోసి మరిగించాలి. మరిగిన తర్వాత వడకట్టి బెల్లం నీటిని పక్కనుంచాలి. కుక్కర్లో బియ్యం, పప్పు వేసి 2 కప్పుల నీరు, 3 యాలకులు వేసి 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారాక గరిటతో బాగా మెదిపి, బెల్లం నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని మరో పది నిమిషాలు చిక్కబడేవరకు ఉడికించాలి. చివరలో కొద్దిగా నెయ్యి వేసి కిస్‌మిస్, జీడిపప్పు, యాలకుల పొడి కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి.
Updated Date - 2020-01-15T20:17:53+05:30 IST