నువ్వుల అరిసెలు
ABN, First Publish Date - 2020-01-11T17:44:35+05:30
బియ్యం - ఒక కేజీ, బెల్లం - అర కేజీ, యాలకుల పొడి - ఒక టీస్పూన్, నువ్వులు - 50 గ్రాములు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, అరిసెల చెక్కలు.
కావలసినవి: బియ్యం - ఒక కేజీ, బెల్లం - అర కేజీ, యాలకుల పొడి - ఒక టీస్పూన్, నువ్వులు - 50 గ్రాములు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, అరిసెల చెక్కలు.
తయారీ విధానం: ముందుగా బియ్యంను ఒక రోజంతా నానబెట్టాలి. తరువాత వాటిని మెత్తటి పిండిలా పట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని స్టవ్‌పై పెట్టి బెల్లం వేసి, ఒక కప్పు నీళ్లు పోసి చిన్నమంటపై మరిగించాలి. బెల్లం కరిగి పానకం తయారయ్యాక నువ్వులు వేయాలి. యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆర్పేసి బియ్యం పిండిని వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. చేతులకు కొద్దిగా నూనె రాసుకుంటూ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని అరిసెలుగా ఒత్తుకోవాలి. వెడల్పాటి పాన్ స్టవ్‌పై పెట్టి నూనె పోసి వేడి అయ్యాక అరిసెలు వేసి వేగించాలి. రెండు వైపులా సమంగా వేగేలా చూసుకోవాలి. అరిసెలకు నూనె ఎక్కువగా ఉంటే కనుక చెక్కలతో ఒత్తుకోవాలి.
Updated Date - 2020-01-11T17:44:35+05:30 IST