కొబ్బరి బూరెలు
ABN, First Publish Date - 2020-01-11T17:50:10+05:30
కేజీ, బెల్లం - ముప్పావు కేజీ, కొబ్బరి ముక్కలు - రెండు, డాల్డా - 100గ్రాములు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.
కావలసినవి:బియ్యప్పిండి - కేజీ, బెల్లం - ముప్పావు కేజీ, కొబ్బరి ముక్కలు - రెండు, డాల్డా - 100గ్రాములు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం: బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేయాలి.కొబ్బరి ముక్కలు, బెల్లంను విడిగా గ్రైండర్ వేసి పొడి చేసుకోవాలి.వెడల్పాటి పాన్‌లో బెల్లంను వేడి చేయాలి. బెల్లం త్వరగా కరగడానికి కొద్దిగా నీళ్లు పోయాలి. బెల్లం పానకం వేళ్లకు అంటుకున్నట్లుగా ఉండేలా చూసుకోవాలి.ఇప్పుడు ఈ పానకంలో కొబ్బరి పొడి యాలకుల పొడి, డాల్డా వేసి కలియబెట్టాలి.ఇప్పుడు బియ్యప్పిండి వేసి కలపాలి.తరువాత పిండిని చిన్నచిన్న బూరెల మాదిరిగా ఒత్తుకోవాలి.పాన్‌లో నూనె పోసి బూరెల్ని గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి.
Updated Date - 2020-01-11T17:50:10+05:30 IST