బ్రెడ్ గులాబ్ జామ్
ABN, First Publish Date - 2020-05-10T18:00:20+05:30
పంచదార - ఒక కప్పు, నీరు - ఒక కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నిమ్మరసం - అర చెక్క, బ్రెడ్ స్లయి్‌సలు - 4, మిల్క్ పొడి - 2 టేబుల్ స్పూన్లు, క్రీమ్ - ఒక టేబుల్ స్పూను, పాలు -
కావలసిన పదార్థాలు: పంచదార - ఒక కప్పు, నీరు - ఒక కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నిమ్మరసం - అర చెక్క, బ్రెడ్ స్లయి్‌సలు - 4, మిల్క్ పొడి - 2 టేబుల్ స్పూన్లు, క్రీమ్ - ఒక టేబుల్ స్పూను, పాలు - రెండు టేబుల్ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ముందుగా పంచదారలో నీరు పోసి, యాలకుల పొడి, నిమ్మరసం కలిపి 4 నిమిషాలు మరిగించి లేతపాకం రాగానే పక్కనుంచాలి. బ్రెడ్ స్లయి్‌సల అంచులు కట్ చేసి ముక్కలుగా చేసి మిక్సీలో బరకగా పొడి చేయాలి. ఈ పొడికి మిల్క్ పొడి, క్రీమ్, పాలు కలిపి ముద్దగా చేసి చిన్న చిన్న ఉండలు చేయాలి. వీటిని నూనెలో వేగించి పంచదార పాకంలో వేసి రెండు గంటలపాటు ఉంచి తర్వాత సర్వ్ చేయాలి.
Updated Date - 2020-05-10T18:00:20+05:30 IST