ఫలూదా
ABN, First Publish Date - 2020-06-02T16:44:11+05:30
సబ్జ గింజలు - 3 టీ స్పూన్లు, సేమియా 50 గ్రా, పంచదార - 50 గ్రా, వెనీల ఐస్‌క్రీమ్ -50 గ్రా, స్ట్రాబెర్రీ జెల్లీ -2 టేబుల్ స్పూన్లు, రోజ్ సిరప్ - ఒక టీ స్పూను
కావలసిన పదార్థాలు: సబ్జ గింజలు - 3 టీ స్పూన్లు, సేమియా 50 గ్రా, పంచదార - 50 గ్రా, వెనీల ఐస్‌క్రీమ్ -50 గ్రా, స్ట్రాబెర్రీ జెల్లీ -2 టేబుల్ స్పూన్లు, రోజ్ సిరప్ - ఒక టీ స్పూను, చిక్కటి పాలు - పావు లీటరు, డ్రైఫ్రూట్స్ తరుగు - అలంకరణకు.
తయారుచేసే విధానం: ఒక కప్పులో సబ్జ గింజలు వేసి నీరుపోసి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈలోపు సేమియాని కొద్ది నీటిలో పొడిగా ఉడికించి, పంచదార కలిపి దించేయాలి. పాలలో కొద్దిగా పంచదార వేసి మరిగించి చల్లారిన తర్వాత కొద్దిగా రోజవాటర్‌రను కలిపి గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇపుడు ఒక గ్లాసులో అడుగున రెండు ఐస్ క్యూబ్‌లు వేసి పైనుండి తగుమోతాదులో సేమియా, ఐస్ తురుము, రోజ్ సిరప్, స్ట్రాబెర్రీ జెల్లీ, సబ్జ గింజలు, మళ్లీ సేమియా, వెనిలా, రోజ్ సిరప్ కలిపిన పాలు వేసి పైనుండి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి సర్వ్ చేయాలి.
Updated Date - 2020-06-02T16:44:11+05:30 IST