ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోలీ కాంజీ!

ABN, First Publish Date - 2020-03-10T18:34:13+05:30

హోలీ వేడుకల్లో అలసట లేకుండా పాల్గొనాలంటే, తగిన హుషారు అందించే పానీయం సేవించాలి. అదే... ‘కాంజీ’! తరతరాలుగా వాడుకలో ఉన్న ఈ హోలీ పానీయంలో పోషకాలు బోలెడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోలీ వేడుకల్లో అలసట లేకుండా పాల్గొనాలంటే, తగిన హుషారు అందించే పానీయం సేవించాలి. అదే... ‘కాంజీ’! తరతరాలుగా వాడుకలో ఉన్న ఈ హోలీ పానీయంలో పోషకాలు బోలెడు.


కాంజీ పానీయం తయారీలో వాడే నలుపు, ముదురు వంకాయ రంగు క్యారెట్లు ఏడాది మొత్తంలో మూడు నెలల్లోనే దొరుకుతాయి. వీటితో తయారయ్యే కాంజీ అజీర్తిని తొలగించి, కడుపు ఉబ్బరం, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది కళ్లకూ, ఎముకలకూ బలవర్ధకం కూడా! 


కావలసినవి:

వంకాయ రంగు క్యారెట్లు: 5

రుచికి: నల్ల ఉప్పు

ఆవ పొడి: ఒక టేబుల్‌ స్పూను

నీళ్లు: సరిపడా


తయారీ విధానం:

క్యారెట్లు కడిగి, తోలు తీసి, అర అంగుళం ముక్కలుగా తరగాలి. 

గిన్నెలో నీళ్లు మరిగించి, తరిగిన క్యారెట్‌ ముక్కలు వేసి పది నిమిషాలు మూత ఉంచాలి.

తర్వాత దీన్ని కుండ లేదా జాడీలో నింపాలి.

దీనిలో ఉప్పు, ఆవ పొడి వేసి కలపాలి.

గాజు గుడ్డతో మూతి బిగించి ఎండలో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఉంచాలి.

రోజులో ఒకసారి వెదురు గరిటతో కలుపుతూ ఉండాలి.

అయిదో రోజు వడగట్టి సీసాల్లో నింపాలి. ఇదే కాంజీ పానీయం.

మిగిలిన క్యారెట్‌ ముక్కలను పచ్చడి ముక్కలుగా వాడుకోవచ్చు.

Updated Date - 2020-03-10T18:34:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising