కుల్ఫీ
ABN, First Publish Date - 2020-08-15T18:52:51+05:30
యాలకులు - నాలుగు, కుంకుమపువ్వు - చిటికెడు, పిస్తా - పావు కప్పు, కండెన్స్‌డ్ పాలు - అరలీటరు, చిక్కటి పాలు - అరలీటరు(వెన్నతీయని లీటరు పాలను అర లీటరు అయ్యే
కావలసినవి: యాలకులు - నాలుగు, కుంకుమపువ్వు - చిటికెడు, పిస్తా - పావు కప్పు, కండెన్స్‌డ్ పాలు - అరలీటరు, చిక్కటి పాలు - అరలీటరు(వెన్నతీయని లీటరు పాలను అర లీటరు అయ్యే వరకు మరిగించాలి), క్రీము - అరకప్పు, బాదం - అర కప్పు, పంచదార - అరకప్పు, మామిడి లేదా నారింజ గుజ్జు - అరకప్పు.
తయారీ: స్టవ్‌పై చిన్న పాన్ పెట్టి కుంకుమపువ్వు కొద్దిగా వేడి చేసి, పొడి చేయాలి. యాలకుల పొడి రెడీ చేసుకోవాలి. పిస్తాలను మరుగుతున్న నీటిలో అర నిమిషం పాటు వేసి తీయాలి. తరువాత చల్లటి నీటిలో కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. మెత్తటి వస్త్రంతో గట్టిగా రుద్దితే వాటి పొట్టు పోతుంది. గ్రైండర్‌లో వేసి పొడి చేసుకోవాలి. మిక్సీలో కండెన్స్‌డ్ పాలు, చిక్కటి పాలు, క్రీము, బాదం, పంచదార, యాలకుల పొడి వేసి పట్టుకోవాలి. ఈ కుల్ఫీ మిక్స్‌ను కొద్దిగా మూడు పాత్రల్లో పోయాలి. ఒక పాత్రలో ఉన్న కుల్ఫీ మిక్స్‌లో కుంకుమపువ్వు, మామిడి పండు గుజ్జు వేసి గ్రైండ్ చేయాలి. తగినంత ఆరెంజ్ కలర్ రాకుంటే మరికొద్దిగా మామిడి పండు గుజ్జు వేయాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మోల్డ్‌లో పావు భాగం వరకు పోయాలి. తరువాత ఫ్రిజ్‌లో పెట్టాలి. వైట్ లేయర్ కోసం అదే కుల్ఫీ మోల్డ్‌లో ఏ రంగూ కలపని కుల్ఫీ మిక్స్ పోసి, మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆకుపచ్చ లేయర్ కోసం ఇంకో పాత్రలో ఉన్న కుల్ఫీ మిక్స్‌లో పిస్తా పొడి వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చివరగా మోల్డ్‌లో పోసి ఫ్రిజ్‌లో పెడితే తిరంగా కుల్ఫీ రెడీ.
Updated Date - 2020-08-15T18:52:51+05:30 IST