దివాళీ పల్లీ పట్టి
ABN, First Publish Date - 2020-11-13T18:25:03+05:30
వేరుశనగలు - ఒకటిన్నర కప్పు, బెల్లం తురుము - ఒక కప్పు, వంటసోడా - పావు టీ స్పూను. అల్యూమినియం కాయిల్ - ప్లేటుకు సరిపడా, నెయ్యి - ఒక టీ స్పూను.
కావలసిన పదార్థాలు: వేరుశనగలు - ఒకటిన్నర కప్పు, బెల్లం తురుము - ఒక కప్పు, వంటసోడా - పావు టీ స్పూను. అల్యూమినియం కాయిల్ - ప్లేటుకు సరిపడా, నెయ్యి - ఒక టీ స్పూను.
తయారుచేసే విధానం: కడాయిలో వేరుశనగలు నెమ్మదిగా, దోరగా వేగించి చల్లారిన తర్వాత పొట్టుతీసి పక్కనుంచాలి. ఒక ప్లేట్‌పై అల్యూమినియం కాయిల్ పరచి ఉంచాలి (అల్యూమినియం కాయిల్ లేకపోతే ప్లేట్‌కు నెయ్యి రాసి ఉంచుకోండి). కడాయిలో బెల్లం తురుము వేసి నీరు పోయకుండా చిన్నమంటపై కరిగించి నెయ్యి కలపాలి. బెల్లం ముదురుపాకం వచ్చి గట్టిపడ్డాక వంటసోడా, వేరు శనగల బద్దలు వేసి బాగా కలిపి అల్యూమినియం కాయిల్‌పై పోసి నెయ్యి రాసిన చెంచాతో చదునుగా ఒత్తాలి. తర్వాత రొట్టెల కర్రతో పైనుంచి రోల్ చేసి కత్తితో మీకు కావలసిన షేపులో కోసి మూడు గంటలు వదిలేయాలి. ఇప్పుడు అల్యూమినియం కాయిల్ లాగేసి అచ్చును ముక్కలుగా తుంచి డబ్బాలో వుంచుకోవాలి.
Updated Date - 2020-11-13T18:25:03+05:30 IST