మూడు రంగుల కప్ కేక్
ABN, First Publish Date - 2020-08-15T18:21:20+05:30
ఆరెంజ్ ఫుడ్ కలర్ - కొద్దిగా, గ్రీన్ ఫుడ్ కలర్ - కొద్దిగా, క్రీమ్ - తగినంత, వెన్న - ఒక కప్పు, పంచదార - నాలుగు కప్పులు
కావలసినవి: ఆరెంజ్ ఫుడ్ కలర్ - కొద్దిగా, గ్రీన్ ఫుడ్ కలర్ - కొద్దిగా, క్రీమ్ - తగినంత, వెన్న - ఒక కప్పు, పంచదార - నాలుగు కప్పులు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - రెండు టీస్పూన్లు, హెవీ క్రీమ్ - రెండు టేబుల్‌స్పూన్లు, పిండి - కొద్దిగా.
తయారీ: ముందుగా పిండిని మూడు భాగాలుగా చేసి ఒక దానిలో ఆరెంజ్ కలర్, మరొక దాంట్లో గ్రీన్ కలర్ కలపాలి. కప్ కేక్ పాన్ తీసుకుని అందులో ముందుగా గ్రీన్ కలర్ పిండి వేయాలి. తరువాత తెలుపు రంగు, దానిపైన ఆరెంజ్ కలర్ కలిపిన పిండి వేయాలి. ఓవెన్‌లో బేకింగ్ చేయాలి. ఒక స్టీల్ పాత్ర తీసుకుని అందులో వెన్న వేసి మిక్సర్‌తో బాగా కలపాలి. కొద్దికొద్దిగా పంచదార వేసుకుంటూ కలియబెట్టాలి. చివరగా వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, పాలు వేసి మిశ్రమం మెత్తగా కలిపి, మిశ్రమాన్ని మూడు భాగాలుగా చేయాలి. ఒక భాగంలో ఆరెంజ్ కలర్, ఇంకో భాగంలో గ్రీన్ కలర్ కలపాలి. మరొక భాగంలో ఏ రంగూ కలపకూడదు. ఓవెన్‌లోని కప్ కేక్ తీసుకుని దానిపై ముందుగా గ్రీన్ కలర్ మిశ్రమం, తరువాత తెల్లటి మిశ్రమం, చివరగా ఆరెంజ్ కలర్ మిశ్రమం వేయాలి. కేక్‌ను కోన్ ఆకారంలో వచ్చేలా వేసుకోవాలి.
Updated Date - 2020-08-15T18:21:20+05:30 IST