రొయ్యల కూర
ABN, First Publish Date - 2020-02-01T20:26:16+05:30
రొయ్యలు - అరకేజీ, నూనె - సరిపడా, టొమాటోలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, ధనియాలు - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - ఒక టీస్పూన్, ఎండు మిర్చి - పది, చింతపండు - కొద్దిగా.
కావలసినవి : రొయ్యలు - అరకేజీ, నూనె - సరిపడా, టొమాటోలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, ధనియాలు - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - ఒక టీస్పూన్, ఎండు మిర్చి - పది, చింతపండు - కొద్దిగా.
తయారీ: కొబ్బరితురుము, వెల్లుల్లిరెబ్బలు, ధనియాలు, ఎండుమిర్చిని మిక్సీలో వేసి మసాలా పేస్టు తయారుచేసుకోవాలి.పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తరువాత మసాలా పేస్టు వేసి చిన్నమంటపై ఐదు నిమిషాలు వేగించాలి.ఇప్పుడు రొయ్యలు వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి టొమాటో ముక్కలు, ఉప్పు వేయాలి.చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించాలి. కొద్దిగా చింతపండు రసం పోసి మరికాసేపు ఉంచి దించాలి. అన్నంలోకి ఈ రొయ్యల కూర రుచిగా ఉంటుంది.
Updated Date - 2020-02-01T20:26:16+05:30 IST