కొబ్బరిపాల చికెన్
ABN, First Publish Date - 2020-07-05T17:43:18+05:30
చికెన్ - అరకేజీ, కొబ్బరి పాలు - రెండు కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల, జీరాపొడి, కారం - 1 స్పూను చొప్పున, మిరియాల పొడి - అర స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - పావు స్పూను, పచ్చిమిర్చి - 3, కరివేపాకు - 8 రెబ్బలు, నూనె - పావు కప్పు,
కావలసిన పదార్థాలు: చికెన్ - అరకేజీ, కొబ్బరి పాలు - రెండు కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల, జీరాపొడి, కారం - 1 స్పూను చొప్పున, మిరియాల పొడి - అర స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - పావు స్పూను, పచ్చిమిర్చి - 3, కరివేపాకు - 8 రెబ్బలు, నూనె - పావు కప్పు, యాలకులు, లవంగాలు - 3 చొప్పున, దాల్చినచెక్క - అరంగుళం, ఉల్లి తరుగు - ఒక కప్పు, మిరియాల పొడి - అర స్పూను; మసాల పొడి కోసం: మిరియాలు - 10, దాల్చినచెక్క - అంగుళం, యాలకులు, లవంగాలు - 3 చొప్పున, బిర్యాని ఆకు - 1.
తయారుచేసే విధానం: చికెన్‌లో అల్లం వెల్లుల్లి, ఉప్పు, గరం మసాల, జీరా, పసుపు, ధనియా, కారం, మిరియాల పొడులు, పచ్చిమిర్చి తరుగు, ఒక టేబుల్ స్పూను నూనె, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, 4 రెబ్బల కరివేపాకు, పావుకప్పు కొబ్బరిపాలు వేసి బాగా కలిపి 6 గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. కడాయిలో నూనె వేసి మసాల పొడి, ఉల్లి తరుగు, కరివేపాకు వేగించి చికెన్ మిశ్రమం కలిపి మూతపెట్టాలి. ముక్క మెత్తబడి నూనె తేలాక మిగతా కొబ్బరిపాలు పోయాలి. కర్రీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి.
Updated Date - 2020-07-05T17:43:18+05:30 IST