ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడిగుడ్డు పచ్చడి

ABN, First Publish Date - 2020-06-27T20:58:40+05:30

కోడిగుడ్లు - మూడు(ఉడికించినవి), గరంమసాలా - రెండు టేబుల్‌స్పూన్లు, మెంతి పొడి - ఒక టీస్పూన్‌, ఆవ పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, అల్లం వెల్లుల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: కోడిగుడ్లు - మూడు(ఉడికించినవి), గరంమసాలా - రెండు టేబుల్‌స్పూన్లు, మెంతి పొడి - ఒక టీస్పూన్‌, ఆవ పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌, ఉప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నిమ్మకాయ - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా. 


తయారీ: ఉడికించిన గుడ్లను పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత ఉడికించిన గుడ్లమీద కత్తితో గాట్లు పెట్టి అందులో వేయాలి. చిన్నమంటపై వేగించాలి. కోడిగుడ్లు గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి. గరంమసాలా, ఉప్పు, కారం వేసి మరి కాసేపు వేగనివ్వాలి. చివరగా కరివేపాకు వేసి దింపాలి. మిశ్రమం చల్లారిన తరువాత ఆవాల పొడి, మెంతి పొడి వేయాలి. కొత్తిమీర వేసుకోవాలి. నిమ్మరసం పిండుకొని కలపాలి. అంతే.. కోడిగుడ్డు పచ్చడి రెడీ. అన్నంలోకి, చపాతీలోకి ఈ పచ్చడి రుచిగా ఉంటుంది.


Updated Date - 2020-06-27T20:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising