ఎగ్‌రోల్
ABN, First Publish Date - 2020-06-27T21:00:27+05:30
కోడిగుడ్లు - నాలుగు, కారం - ఒక టీస్పూన్, క్యారెట్లు - రెండు, ఉప్పు - తగినంత, నూనె - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట, ఉల్లిపాయలు - రెండు.
కావలసినవి: కోడిగుడ్లు - నాలుగు, కారం - ఒక టీస్పూన్, క్యారెట్లు - రెండు, ఉప్పు - తగినంత, నూనె - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట, ఉల్లిపాయలు - రెండు.
తయారీ: ముందుగా ఒక బౌల్‌లో కోడిగుడ్లు కొట్టి వేయాలి. అందులో ఉప్పు, కారం, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి బాగా కలపాలి. వెడల్పాటి పాన్‌ను స్టవ్‌పై పెట్టి కొద్దిగా నూనె రాసి కోడి గుడ్లను ఆమ్లెట్‌లా, కాస్త పలుచగా వేయాలి. ఆమ్లెట్ బాగా కాలిన తర్వాత ఒకవైపు నుంచి స్పూన్‌తో నెమ్మదిగా రోల్ చేయాలి. పాన్‌పై ఖాళీ అయిన ప్లేస్‌లో మళ్లీ ఆమ్లెట్ వేయాలి. ఆ ఆమ్లెట్ కూడా కాలాక, రోల్ చేసిన దీన్ని కూడా ఆమ్లెట్‌తో సహా మళ్లీ రోల్ చేయండి. గరిటెతో వత్తుకుంటూ రెండు వైపులా రోల్‌ను బాగా కాల్చాలి. తరువాత కత్తితో రోల్‌ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎగ్‌రోల్‌ను టొమాటో సాస్‌తో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.
Updated Date - 2020-06-27T21:00:27+05:30 IST