కబాబ్స్
ABN, First Publish Date - 2020-06-27T19:01:05+05:30
కోడిగుడ్లు - మూడు(ఉడికించినవి), బంగాళదుంపలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - చిటికెడు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్
కావలసినవి: కోడిగుడ్లు - మూడు(ఉడికించినవి), బంగాళదుంపలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - చిటికెడు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కార్న్‌ఫ్లోర్ - రెండు టేబుల్‌స్పూన్లు, బ్రెడ్ క్రంబ్స్ - రెండు కప్పులు, మిరియాల పొడి - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారీ: బంగాళదుంపలను ఉడికించి గుజ్జులా చేసుకోవాలి. తరువాత దాంట్లో పచ్చిమిర్చి, పసుపు, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు, రెండు టేబుల్‌స్పూన్ల సెనగపిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను పొడవు ముక్కలుగా కట్ చేయాలి. కోటింగ్ కోసం ఒక పాత్రలో బ్రెడ్ క్రంబ్స్ తీసుకోవాలి. అందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో రెండు టేబుల్‌స్పూన్ల కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి పలుచగా అయ్యేలా కలపాలి. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వెడల్పుగా గారెల్లా ఒత్తుకోవాలి. తరువాత మధ్యలో కోడిగుడ్డు ముక్క పెట్టి చుట్టూ ఆలూ మిశ్రమాన్ని దగ్గరకు ఒత్తి కబాబ్స్ మాదిరిగా చేయాలి. తరువాత వాటిని కార్న్‌ఫ్లోర్‌లో డిప్ చేసుకుంటూ, బ్రెడ్ క్రంబ్స్‌ని అద్దాలి. ఒక పాన్‌ను స్టవ్‌పై పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే.. ఎగ్ కబాబ్స్ రెడీ. వీటిని చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటాయి.
Updated Date - 2020-06-27T19:01:05+05:30 IST