ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొర్రమీను చేపల కూర

ABN, First Publish Date - 2020-06-06T18:17:23+05:30

కొర్రమీను చేపలు - అరకేజీ, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: కొర్రమీను చేపలు - అరకేజీ, ధనియాల పొడి -  రెండు టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర టీస్పూన్‌, కారం- రెండు టీస్పూన్లు, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, మెంతిపొడి - అర టీస్పూన్‌, చింతపండు - యాభై గ్రాములు, నూనె - సరిపడా, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ: ముందుగా చేపలను ఉప్పుతో బాగా శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక బౌల్‌లోకి చేప ముక్కలు తీసుకొని అందులో చింతపండు రసం, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి బాగా కలపాలి. కాసేపు వీటిని పక్కన పెడితే చేప ముక్కలకు మసాలా పట్టుకుంటుంది. 

ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగాక ధనియాల పొడి వేయాలి. వెంటనే చేప ముక్కలు వేసి కలపాలి. తరువాత కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. కొర్రమీను ముక్కలు ఉడికిన తరువాత కొత్తిమీర వేసుకొని దించాలి. 

Updated Date - 2020-06-06T18:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising