మ్యాంగో క్రంబ్ బార్స్
ABN, First Publish Date - 2020-05-23T18:28:57+05:30
మామిడిపండ్లు - మూడు, పంచదార - ఐదు టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్న పిండి - అర టేబుల్‌స్పూన్లు, పిండి - రెండు కప్పులు, బేకింగ్ పౌడర్
కావలసినవి: మామిడిపండ్లు - మూడు, పంచదార - ఐదు టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్న పిండి - అర టేబుల్‌స్పూన్లు, పిండి - రెండు కప్పులు, బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్, ఉప్పు - పావు టీస్పూన్, వెన్న - ముప్పావు కప్పు, కోడిగుడ్డు - ఒకటి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - అర టీస్పూన్.
తయారీ: ముందుగా ఓవెన్‌ను 350 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రతకు వేడి చేయాలి. మామిడిపండును ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో మొక్కజొన్నపిండి, పంచదార వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో పిండి, బేకింగ్‌పౌడర్, తగినంత ఉప్పు తీసుకోవాలి. వెన్నను ముక్కలుగా కట్ చేసి పిండిలో వేసి కలపాలి. ఇప్పుడు కోడిగుడ్డు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ వేయాలి. బాగా కలియబెట్టాలి. మిశ్రమం పొడిపొడిగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని బేకింగ్ పాన్‌పై ఒక లేయర్‌లా వేసుకోవాలి. దానిపై మామిడిపండు మిశ్రమాన్ని అంతటా సమంగా పడేలా పోయాలి. పైన కొద్దిగా పొడి పిండి మిశ్రమాన్ని చల్లాలి. ఓవెన్‌లో 40 నిమిషాల పాటు బేక్ చేయాలి. తరువాత ఓవెన్‌లో నుంచి తీయాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2020-05-23T18:28:57+05:30 IST