మటన్ ఎగ్ ఖీమా
ABN, First Publish Date - 2020-05-09T16:12:17+05:30
లాక్‌డౌన్ మూలంగా బహిరంగ ఇఫ్తార్ విందులు లేకుండా పోయాయి. అయితేనేం ఇంట్లోనే ఇఫ్తార్ విందు రుచికరంగా చేసుకోవచ్చు. టేస్ట్‌తో పాటు శక్తినిచ్చే వెరైటీ రుచులు ఇవి...
ఇంట్లోనే ఇఫ్తార్ రుచులు
లాక్‌డౌన్ మూలంగా బహిరంగ ఇఫ్తార్ విందులు లేకుండా పోయాయి. అయితేనేం ఇంట్లోనే ఇఫ్తార్ విందు రుచికరంగా చేసుకోవచ్చు. టేస్ట్‌తో పాటు శక్తినిచ్చే వెరైటీ రుచులు ఇవి...
మటన్ ఎగ్ ఖీమా
కావలసినవి: మటన్ ఖీమా - పావుకేజీ, కోడిగుడ్లు - నాలుగు, నూనె - ఒక టేబుల్‌స్పూన్, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్, పచ్చిమిర్చి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్, టొమాటో - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, గరంమసాల - రెండు టీస్పూన్లు, కారం - ఒక టీస్పూన్, పసుపు - అర టీస్పూన్, పుదీనా, నిమ్మకాయ - గార్నిష్ కోసం.
చట్నీ కోసం : పుదీనా ఆకులు - ఒక కప్పు, కొత్తిమీర - ఒకటిన్నర కప్పు, పచ్చిమిర్చి - నాలుగు, నిమ్మకాయ - ఒకటి.
తయారీ: పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెన్న వేసి ఉల్లిపాయలను వేగించాలి.
అదే సమయంలో పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో వేసి పేస్టుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు వేసి రెండు నిమిషాల పాటు వేగించాలి.
టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి.
గరంమసాల, కారం, పసుపు వేసి మరికాసేపు వేగించాలి.
ఇప్పుడు ఖీమా వేసి కలుపుకోవాలి. పదినిమిషాల పాటు ఉడకనివ్వాలి.
గ్రీన్ చట్నీ, ఉడికించిన కోడిగుడ్లు వేసి కలుపుకోవాలి.
తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఖీమా మెత్తగా ఉడికే వరకు ఉండనివ్వాలి.
చివరగా పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2020-05-09T16:12:17+05:30 IST