ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరివేపాకు పచ్చడి

ABN, First Publish Date - 2020-09-05T20:20:32+05:30

కరివేపాకు కట్టలు - ఐదు (చిన్నవి), ఎండుమిర్చి - పది, చింతపండు - నిమ్మకాయంత, పసుప్పు - అర టీస్పూన్‌, ధనియాలు అర టీస్పూన్‌, నువ్వులు -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: కరివేపాకు కట్టలు - ఐదు (చిన్నవి), ఎండుమిర్చి - పది, చింతపండు - నిమ్మకాయంత, పసుప్పు - అర టీస్పూన్‌, ధనియాలు అర టీస్పూన్‌, నువ్వులు - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - రెండు చిటికెడులు, నూనె - రెండు టీస్పూన్లు, శనగపప్పు - అర స్పూన్‌, మినప్పప్పు - అర స్పూన్‌, ఆవాలు - అర స్పూన్‌, జీలకర్ర - అర స్పూన్‌. 


తయారీ విధానం: ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి. నువ్వుపప్పు దోరగా వేగించాలి. స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక శెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.  ఆ పోపును ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో ఎండుమిర్చి వేసి వేగించాలి. కాసేపయ్యాక కరివేపాకు వేయాలి. చింతపండు వేసి స్టవ్‌పై నుంచి దింపాలి. చల్లారాక అన్నీ కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కలిపి పచ్చడి తయారీ చేసుకోవాలి.




కరివేపాకులో...

క్యాలరీలు - 108 

కార్బోహైడ్రేట్లు - 18

ఫైబర్‌ - 6.4 గ్రా

ప్రొటీన్‌ - 6 గ్రా


ఇంకా క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, జింక్‌, సి-విటమిన్‌, కాపర్‌, మెగ్నీషియంలు మైక్రోగ్రాముల్లో లభిస్తాయి. కంటిచూపును కాపాడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలం. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. 

Updated Date - 2020-09-05T20:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising